నటన పట్ల ఆసక్తిని చూపుతోన్న అల్లు బాబీ

  • స్టార్ హీరోగా కొనసాగుతోన్న అల్లు అర్జున్ 
  • గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో అల్లు శిరీష్
  •  తమ్ముళ్ల బాటలోనే అల్లు బాబీ  
అల్లువారి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ ఇద్దరు హీరోలు వచ్చేశారు. అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ హీరోగా తన జోరు చూపిస్తున్నాడు. అల్లు శిరీష్ కూడా హీరోగా తన ప్రత్యేకతను చూపించే ప్రయత్నాలతో బిజీగా వున్నాడు. ఈ ఇద్దరి కంటే పెద్దవాడైన అల్లు బాబీ గురించి ఇండస్ట్రీలోనివారికి తప్ప బయటివారికి పెద్దగా తెలియదు.

మొదటి నుంచి నిర్మాణ పరమైన వ్యవహారాలు చూస్తూ వస్తోన్న ఆయనకి, తాజాగా తెరపై కనిపించాలనే ఆసక్తి కలిగిందట. తన వయసుకి తగిన ముఖ్యమైన .. కీలకమైన .. ప్రత్యేకమైన పాత్రలను పోషించాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన తండ్రితో పాటు తనతో సన్నిహితంగా వుండే కొంతమంది దర్శక నిర్మాతల చెవిన కూడా వేశాడని అంటున్నారు. ఒక వైపున నటిస్తూనే తమ బ్యానర్లోని సినిమాల నిర్మాణ వ్యవహారాలను చూసుకోవాలని అల్లు బాబీ భావిస్తున్నాడట. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
Go Back to Shorts
Allu Bobby

More Telugu News